Ponnam: ఇదేనా సభా మర్యాద?
Ponnam: ఇదేనా సభా మర్యాద?
పల్లవి, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ నాయకులకు సభా సాంప్రదాయాలు తెలియవా? అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ పై శుక్రవారం ఆయన మాట్లాడారు. ‘‘చట్టసభల్లో ప్రజాస్వామ్యానికి సభకు నాయకుడు ముఖ్యమంత్రి సభకు అధిపతి స్పీకర్. అటువంటి స్పీకర్ ని పట్టుకొని సభ మీ ఒక్కడిది కాదు అని మాట్లాడడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. గౌరవ స్పీకర్ మీకు మళ్ళీ అవకాశం ఇచ్చి పొరపాటు అంటుంటే అవును మీది కాదు అని మాట్లాడుతూ కనీసం నన్ను సంప్రదించలేదు చెప్పుకోవడానికి అవకాశం కూడా ఇవ్వలేదు మాట్లాడుతున్నారు. ఇవన్నీ గమనిస్తున్న బీఆర్ఎస్ నాయకత్వం కూడా జగదీశ్వర్ రెడ్డి చేసింది తప్పు స్పీకర్ ని సభలో ఇలా మాట్లాడడం మంచిది కాదని చెప్పడం లేదు. దానికి నిన్న ధర్నాలు చేయడం నియోజకవర్గాల్లో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్ళే ఈరోజు నిరసనలు తెలుపుతున్నారు. ఇది హాస్యాస్పదం ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి కనీసం జ్ఞానం రావాలి. సభలో ఏవిధంగా ఉండాలి సభ వేదిక పై ఏ విధంగా ప్రవర్తించాలో తెలిసి కూడా ఇలా చేస్తున్నారంటే ఇది ఉద్దేశ్యపూర్వకంగా చేస్తున్నారు. ఇది ప్రజలు గమనించాలి. సభకు కొన్ని సంప్రదాయాలు, పద్ధతులు ఉంటాయి. ఉదాహరణకు అబద్ధం అనడానికి కూడా విలు లేదు సత్యదూరం అనాలి. శాసన సభలో కొన్ని అంశాలు ఉన్నప్పుడు సభ మీ ఒక్కడిదా అంటే ఆయన శాసన సభకు అధిపతి అందులోనే అర్థం ఉంది. దళితుడు కాబట్టి ఆ విధంగా వ్యవహరించారని మాట్లాడుతున్నారు. ఇదే బీఆర్ఎస్ గతంలో శాసన మండలి చైర్మన్ మీద కాగితాలు పడేశారని ఇద్దరు సభ్యులను తొలగించారు. భర్తరఫ్ చేశారు. ఇలాంటి మాటలు వద్దు ఇలాంటి నిరసనలు బీఆర్ఎస్ కి మంచిది కాదు”అని ఆయన సూచించారు.



