చంద్రబాబుపై కేసీఆర్ సంచలన కామెంట్స్
చంద్రబాబుపై కేసీఆర్ సంచలన కామెంట్స్
పల్లవి, వెబ్ డెస్క్: రాబోయే రోజుల్లో అధికారం మళ్లీ బీఆర్ఎస్ పార్టీదేనని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సింగిల్‌గానే మళ్లీ అధికారంలోకి వస్తామన్నారు. గోదావరిఖని నుంచి మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చేపట్టిన పాదయాత్ర కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా పాదయాత్ర బృందంతో సమావేశమైన కేసీఆర్.. కీలక వ్యాఖ్యలు చేశారు. బెల్లం ఉన్న దగ్గరకే ఈగలు వచ్చినట్టుగా.. తెలంగాణను దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. పదేళ్ల పాలనలో ఎలాంటి ఇబ్బందులు లేవని.. ఇప్పుడు రాష్ట్రం సమస్యల వలయంలో చిక్కుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది భారాస మాత్రమేనని పేర్కొన్నారు. అందరూ ఒక్కో కేసీఆర్‌ల తయారు కావాలన్నారు. కాంగ్రెస్ నోటికొచ్చిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.



