హైదరాబాద్ మేయర్ కు వేధింపులు

పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మీకి వేధింపులు ఎదురయ్యాయి.
ఇటీవల చనిపోయిన బోరబండకు చెందిన సర్ధార్ అనే వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగా తనకు తాను పరిచయం చేసుకుంటూ ఓ అగంతకుడు మేయర్ విజయలక్ష్మీకి ఫోన్లు, మేసేజ్ లు చేశాడు.
మీ తండ్రి కే. కేశవరావుతో పాటు నీ అంతు చూస్తానంటూ ఫోన్ లోనే బెదిరింపులకు దిగాడు ఆ దుండగుడు. ఈ విషయంపై బంజారాహీల్స్ పోలీసులకు మేయర్ సిబ్బంది పిర్యాదు చేశారు. పిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.