హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు

తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ మహానగరంలో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేశారు. నగరంలోని నల్లకుంట, హెచ్ న్యూ పోలీసుల జాయింట్ ఆపరేషన్ జరిపారు. ఈ ఆపరేషన్ లో సుమారు రూ.1.4కోట్ల విలువైన డ్రగ్స్ ను అధికారులు సీజ్ చేశారు. దీనికి సంబంధించి ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు.