నాచారం డీపీఎస్ కి ప్రతిష్ఠాత్మక అవార్డు
డిపిఎస్ నాచారం కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్..ప్రతిష్ఠాత్మక డిడాక్(DIDAC)అవార్డుని గెల్చుకుంది.
 
                                
డిపిఎస్ నాచారం కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్..ప్రతిష్ఠాత్మక డిడాక్(DIDAC)అవార్డుని గెల్చుకుంది. విద్యార్థుల శ్రేయస్సు,ఎంగేజ్ మెంట్స్ లో స్కూల్ కృష్టికి ఈ అవార్డు లభించింది. విద్యారంగంలో డిడాక్ – ఐడిఎ ఎడ్యుకేషన్ అవార్డులు అత్యంత గౌరవనీయమైనవిగా భావిస్తుంటారు. పాఠశాలలు, అధ్యాపకులు,ఆవిష్కరణలు, విద్యార్ధులను ప్రోత్సహించడంలో నిబద్ధతను ప్రదర్శించే సంస్థలను గుర్తించి ఈ అవార్డులను అందిస్తుంటారు.
విలువలను పాటిస్తూ,కేంబ్రిడ్జ్ విద్యా మార్గంలో 21వ శతాబ్దంలో విజయం సాధించడానికి విద్యార్థులను తీర్చిదిద్దుతున్న స్కూల్ నిబద్దతను ఇది హైలెట్ చేస్తుంది. సెప్టెంబర్ 18న ఢిల్లీలోని జరిగిన ప్రతిష్ఠాత్మక DIDAC–IDA ఎడ్యుకేషన్ అవార్డ్స్ 2024 కార్యక్రమంలో నాచారం డీపీఎస్ సీఈవో,డైరక్టర్ మల్క యశస్వి ఈ అవార్డ్ ని అందుకున్నారు.

ఇంటరాక్టివ్ క్లాస్రూమ్ యాక్టివిటీస్ నుండి పార్టిసిపేటరీ కో-కరిక్యులర్ ఈవెంట్ల వరకు లెర్నింగ్ వాతావరణాన్ని సృష్టించడానికి నాచారం డీపీఎస్ ప్రాధాన్యతనిస్తుంది. DPS నాచారంలోని కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ పాఠ్యప్రణాళిక దాని ప్రత్యేక విధానానికి వివిధ ప్రతిష్టాత్మక సంస్థల నుండి ప్రశంసలు, అవార్డులను పొందుతూనే ఉంది.
DIDAC అవార్డు కేవలం గౌరవం మాత్రమే కాదు..విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాలనే స్కూల్ విజన్ కి ప్రతిబింబం. ప్రతి విద్యార్థికి ప్రకాశవంతమైన రేపటిని రూపొందించే దిశగా నాచారం డీపీఎస్ తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.
Related News
- 
                                    ఏరోసిటీ డీపీఎస్ లో ఘనంగా సమ్మర్ క్యాంప్-2025 వేడుకలు..!
- 
                                    ఒక పుస్తకం.. మంచి మిత్రుడితో సమానం
- 
                                    ‘పాక్సోరా యాప్’ను పరిచయం చేసిన DPS నాచారంలోని కేంబ్రిడ్జ్ విద్యార్థులు
- 
                                    రాష్ట్ర స్థాయి టైక్వాండో ఛాంపియన్షిప్లో డీపీఎస్ నాచారం విజయం
- 
                                    ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో ఘనంగా లైబ్రరీ వీక్ సెలబ్రేషన్స్
- 
                                    నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో ఘనంగా యాన్యువల్ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్

 
          



