నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో ఘనంగా యాన్యువల్ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్
నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో ఘనంగా యాన్యువల్ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ వేడుకల్లో CBSE 1వ తరగతి నుంచి 6 తరగతుల విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు
పల్లవి, హైదరాబాద్: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించి అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాలని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ మల్క కొమరయ్య అన్నారు. స్టూడెంట్స్ ప్రాథమిక స్థాయి నుంచే స్పోర్ట్స్ అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు ఢిల్లీ పబ్లిక్ స్కూలు నాచారం క్యాంపస్ లో సీబీఎస్ఈ 1 నుంచి 6వ క్లాస్ విద్యార్థులకు వార్షిక క్రీడా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు డీపీఎస్ చైర్మన్ మల్క కొమరయ్య, ఐఏఎస్ ఆపీసర్ వెంకటేశ్, కమాండర్ ప్రవీణ్ కుమార్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. క్రీడా వేడుకలను ఉద్దేశించి సీనియర్ ప్రిన్సిపల్ సునీతా రావు మాట్లాడుతూ.. డీపీఎస్ స్టూడెంట్స్ ఆల్ రౌండ్ డెవలప్ మెంట్ కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా క్రీడా పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించారు.




