పల్లవి స్కూల్లో క్రిస్మస్ వేడుకలు
క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని విద్యార్థులు, ఉపాధ్యాయులతో తిరుమలగిరిలోని పల్లవి మోడల్ స్కూల్ హాళ్లు ఆనందంతో, నవ్వులతో నిండిపోయాయి. ఈ సంవత్సరం క్రిస్మస్ వేడుకలు 2024, డిసెంబర్ 21న జరిగాయి. పాఠశాలలో అందంగా అలంకరించిన చెట్టును మెరిసే లైట్లు, విద్యార్థులు చేతితో తయారు చేసిన ఆభరణాలతో ముస్తాబు చేశారు.
విద్యార్థుల సంగీతం, నాటకాలతో ద్వారా క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రీ-ప్రైమరీ పిల్లలు ప్రదర్శించిన సంప్రదాయ నేటివిటీ ప్లే ఈ వేడుకలో హైలైట్ గా నిలిచింది. శాంటాక్లాజ్ ప్రత్యేకంగా దర్శనమిచ్చి చిన్నారులకు చాక్లెట్లు పంచి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల ముఖాల్లో ఆనందభాష్పాలు వెల్లివిరిసి, వేడుక విజయవంతమైంది.
అసెంబ్లీ తరువాత తరగతి గదులు మ్యాజికల్ క్రిస్మస్ వర్క్‌షాప్‌లుగా మారాయి. ఈ వేడుకలు విద్యార్థుల్లో ఆనందాన్ని, కొత్త ఉత్సాహాన్ని తీసుకురావడం తమకెంతో సంతోషాన్ని ఇచ్చిందని స్కూల్ యాజమాన్యం తెలిపింది.

Related News
-
ఏరోసిటీ డీపీఎస్ లో ఘనంగా సమ్మర్ క్యాంప్-2025 వేడుకలు..!
-
పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో 2K సైక్లోథాన్
-
పల్లవి స్కూల్లో పోటీ పరీక్షల కోసం ప్రత్యేక శిక్షణ సెషన్
-
ఎడ్యూటెన్ ఫిన్లాండ్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ 2024లో పల్లవి స్కూల్ హవా
-
తిరుమలగిరి పల్లవి స్కూల్లో సంక్రాంతి సంబరాలు
-
విద్యార్థులు గౌరవంపై పల్లవి స్కూల్లో ప్రత్యేక అసెంబ్లీ



