విద్యార్థులు గౌరవంపై పల్లవి స్కూల్లో ప్రత్యేక అసెంబ్లీ
బోయిన్‌పల్లిలోని పల్లవి మోడల్ స్కూల్లో గ్రేడ్-VIII G విద్యార్థులు అసెంబ్లీ నిర్వహించారు. విద్యార్థులు గౌరవానికి ఉన్న ప్రాముఖ్యతను పెంచే ఆలోచనతో సభను ప్రారంభించారు. దీని తర్వాత ప్రేక్షకులు కరెంట్ అఫైర్స్‌తో కనెక్ట్ అయ్యేలా వార్తల ముఖ్యాంశాలు తెలిపారు.
బోయిన్‌పల్లిలోని పల్లవి మోడల్ స్కూల్లో గ్రేడ్-VIII G విద్యార్థులు అసెంబ్లీ నిర్వహించారు. విద్యార్థులు గౌరవానికి ఉన్న ప్రాముఖ్యతను పెంచే ఆలోచనతో సభను ప్రారంభించారు. దీని తర్వాత ప్రేక్షకులు కరెంట్ అఫైర్స్‌తో కనెక్ట్ అయ్యేలా వార్తల ముఖ్యాంశాలు తెలిపారు. అనంతరం విద్యార్థులు గౌరవ విలువలను పటిష్టపరిచేలా చిన్నపాటి స్కిట్‌ను ప్రదర్శించారు.
అలాగే పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు రూపొందించిన క్విజ్‌తో సభ కొనసాగింది. ఆపైన విద్యార్థులు తమ స్టెప్పులతో నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని సభకు మ్యాజికల్ టచ్ ఇచ్చేలా నృత్యం చేశారు. వైస్ ప్రిన్సిపాల్ శ్రీమతి పూజా సక్సేనా వివేకానందుడి మాటలతో సభ ముగిసింది.



