పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో 2K సైక్లోథాన్

పర్యావరణ స్పృహ, ప్రపంచ సామరస్యాన్ని ప్రోత్సహించడానికి బాచుపల్లిలోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో 2K సైక్లోథాన్ నిర్వహించారు. ఏప్రిల్ 22న ప్రపంచ భూమి దినోత్సవాన్ని పురస్కరించుకుని చైర్మన్ మల్క కొమరయ్య, మల్క పల్లవి, డైరెక్టర్ సుశీల్ కుమార్ ఆధ్వర్యంలో ఈ 2K సైక్లోథాన్ జరిగింది. ఈ కార్యక్రమంలో 200కుపైగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సైక్లోథాన్కు ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ కబడ్డీ ప్లేయర్ ప్రేమ్ రాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్కూల్ పాఠాల్లో క్రీడలను చేర్చే అంశంపై ఆయన ప్రసంగించారు. భవిష్యత్ తరాలకు భూమి స్వచ్ఛతను పెంపొందించడానికి గ్లోబల్ పీస్ ప్రాజెక్ట్ ను స్కూల్ యాజమాన్యం ప్రోత్సహిస్తోందని స్కూల్ మేనేజ్మెంట్ తెలిపింది. ‘గ్రీన్ ఎర్త్ – పీస్ఫుల్ వరల్డ్’ పై బలమైన నమ్మకాన్ని సైక్లోథాన్ ప్రతిబింబిస్తుందని అభిప్రాయపడింది.
Related News
-
మోదీ జీవితం అందరికీ ఆదర్శం – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
-
తెలంగాణ విమోచన వేడుకల్లో ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
-
గురుపూజోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
-
సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర కీలకం – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
-
స్థానిక ఎన్నికల్లో కష్టపడితే బీజేపీదే గెలుపు – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
-
పల్లవి మోడల్ స్కూల్ లో ఘనంగా హిందీ దివస్