ఎడ్యూటెన్ ఫిన్లాండ్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ 2024లో పల్లవి స్కూల్ హవా
ఎడ్యూటెన్ నిర్వహించే ఎడ్యూటెన్ ఫిన్లాండ్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ 2024 (Eduten Finland Mathematics Olympiad 2024) అనే కార్యక్రమం నైపుణ్యాలను, సమస్య పరిష్కార సామర్థ్యాలను ప్రదర్శించడానికి దేశవ్యాప్తంగా ఉన్న యువ గణిత శాస్త్రజ్ఞులను ఒకచోట చేర్చే ప్రతిష్టాత్మక పోటీ.

ఎడ్యూటెన్ నిర్వహించే ఎడ్యూటెన్ ఫిన్లాండ్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ 2024 (Eduten Finland Mathematics Olympiad 2024) అనే కార్యక్రమం నైపుణ్యాలను, సమస్య పరిష్కార సామర్థ్యాలను ప్రదర్శించడానికి దేశవ్యాప్తంగా ఉన్న యువ గణిత శాస్త్రజ్ఞులను ఒకచోట చేర్చే ప్రతిష్టాత్మక పోటీ. ఈ పోటీలో పల్లవి అవేర్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు సాధించిన అత్యుత్తమ విజయాలను యాజమాన్యం ప్రకటించింది.
గ్రేడ్-2 నుంచి నేహాల్ శర్మ జాతీయ స్థాయి టాపర్గా 1వ స్థానం సాధించగా, గ్రేడ్ 2 నుంచి కె.సాయి 9వ స్థానం సాధించారు. ప్రిన్సిపాల్ శ్రీమతి మోనికా చావ్లా మాట్లాడుతూ, విద్యలో అత్యుత్తమ ప్రదర్శన కోసం పాఠశాల నిబద్ధతను హైలైట్ చేశారు. విద్యార్థుల అద్భుతమైన ప్రదర్శనను అభినందించారు.