తిరుమలగిరి పల్లవి స్కూల్లో సంక్రాంతి సంబరాలు
సంక్రాంతి అనగా నూతన క్రాంతి . సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటారు.అయితే ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అంటారు. ఈ పండుగ విశేషాలను గురించి తెలుపుతూ తిరుమలగిరి పల్లవి స్కూల్లో విద్యార్థులు తెలుగుదనాన్ని ఉట్టిపడేలా సంక్రాంతి సంబరాలని నిర్వహించటం జరిగింది.

సంక్రాంతి అనగా నూతన క్రాంతి . సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటారు.అయితే ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అంటారు. ఈ పండుగ విశేషాలను గురించి తెలుపుతూ తిరుమలగిరి పల్లవి స్కూల్లో విద్యార్థులు తెలుగుదనాన్ని ఉట్టిపడేలా సంక్రాంతి సంబరాలని నిర్వహించటం జరిగింది. ఈ సంక్రాంతి సంబరాలను పాఠశాలలోని విద్యార్థులు ఉత్సాహ కేరింతలతో జనరంజకంగా జరుపుకున్నారు.
విద్యార్థులు ముందు ప్రార్థనా గీతంతోప్రారంభించి శ్లోకాలతో అలరించారు. తరువాత విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనతో అందరిని అలరించి ఆకర్షించారు. భోగి,సంక్రాంతి, కనుమ పండుగలను గురించి తెలిపే నాటక ప్రదర్శన అద్భుతంగా జరిగింది.