అవి తర్వాత.. ముందు హైడ్రా ఆఫీస్‌ను కూల్చేయండి: బీఆర్ఎస్
హైదరాబాద్ లో చెరువులు, నాలాలు ఆక్రమించి నిర్మించిన భవనాలపై హైడ్రా కొరడా ఝుళిపిస్తోంది. దీంతో అక్రమ కట్డడాలు చేపట్టిన వారిలో భయం మొదలైంది. అయితే, హైడ్రా కూల్చివేతలపై పెద్ద చర్చే జరుగుతోంది. సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టకుండా.. చెరువులను కబ్జా చేసి పలువురు రాజకీయ నాయకులు ఫామ్ హౌస్ లు కట్టుకున్నారని.. ముందు వాటిని కూల్చాలని పలువురు నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు.
నాలాలపై ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఉన్నాయని.. వాటిని కూడా కూలుస్తారా? అని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న హైడ్రా ఆఫీస్ కూడా హుస్సేన్ సాగర్ నాలాపై కట్టారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నేతలు ఫోటోలను షేర్ చేస్తున్నారు.
లిబర్టీ వద్ద ఉన్న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానిది కూడా ఇదే పరిస్థితని ఉందని.. ముందు ఈ రెండు ప్రభుత్వ భవనాలను కూల్చేయండని.. అప్పుడే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం కలుగుతుందని ఎక్స్ లో గూగుల్ మ్యాప్‌ను అటాచ్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు పోస్టులు పెడుతున్నారు.



