పల్లవి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల ప్రతిభ

పల్లవి, వెబ్ డెస్క్ : పల్లవి ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదువుతున్న ఫైనలియర్ విద్యార్థులు జేఎన్టీయూహెచ్ నిర్వహించే మేజర్ ప్రాజెక్టులో భాగంగా “సోలార్ ఎలక్ట్రికల్ వెహికల్ “ను రూపొందించి జేఎన్టీయూహెచ్ నుండి మేజర్ ప్రాజెక్టు వైభవ్ ఎగ్జామినర్ గా విచ్చేసిన ప్రొఫెసర్ డాక్టర్ కిరణ్ కుమార్, పల్లవి కళాశాల డైరెక్టర్ డాక్టర్ రామ శేషగిరిరావు, ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.బి.రాజు, డీన్ అడ్మినిస్ట్రేటివ్ అంబాల శ్రీధర్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ హెచ్. ఓ .డి డాక్టర్ విశ్వప్రకాష్ బాబు గార్ల సమక్షంలో ఆవిష్కరించి “సోలార్ ఎలక్ట్రికల్ వెహికల్” డ్రైవ్ చేసి చూపించారు.
కాగా కళాశాల చైర్మన్ మల్కా కొమరయ్య, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ మల్కా నవీన్ కుమార్ గార్లు విద్యార్థులను, అధ్యాపకులను అభినందించారు.ఈ ఎలక్ట్రికల్ వెహికల్ సోలార్ చార్జింగ్‌తో నడుస్తుందని, రాత్రివేళ కూడా నడుస్తుందని విద్యార్థులు తెలిపారు.ఓల్టేజ్ లెవెల్స్, కరెంట్ లెవెల్స్ డిస్ప్లే ఉంటుందని దీనికి EV చార్జింగ్ ప్లగ్ సిస్టంను అమర్చామని, 60 కిలోమీటర్ల స్పీడుతో సులభంగా డ్రైవ్ చేయవచ్చునని తక్కువ ఖర్చుతో రూపొందించామని విద్యార్థులు తెలిపారు.
కాగా సోలార్ ఎలక్ట్రికల్ వెహికల్ ద్వారా కాలుష్యం తగ్గుతుందని వారు తెలిపారు.ఈ ప్రాజెక్టుకు గైడులుగా డాక్టర్ విశ్వ ప్రకాష్ బాబు, V.సైదులు, బి.రాజు వ్యవహరించగా ఫైనల్ ఇయర్ విద్యార్థులైన ఎం.సతీష్ ,ఎం.చందు, జి.మధుకర్, J.అజయ్, ఏ.భాను ప్రసాద్, జి.రవితేజ, బి. హిమబిందు, ఎస్.నిఖిల్ వి.రవలి,కే.విష్ణువర్ధన్, వి.రమేష్ లు ఎలక్ట్రికల్ వెహికల్ ను రూపొందించారు.కాగా విద్యార్థులు, అధ్యాపకులు పెద్ద ఎత్తున విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు.
Related News
-
సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర కీలకం – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
-
భారీ ధర పలికిన బాలాపూర్ లడ్డూ
-
మహిళల ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి- ఎంపీ కావ్య
-
సామాజిక కార్యక్రమాలకే ఎక్కువ సమయం కేటాయిస్తా -ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
-
వచ్చే సీజన్ కోసం కూలైన్లల్లో రైతులు -ఎంపీ రఘువీరారెడ్డి
-
శిల్పాశెట్టి దంపతులపై కేసు నమోదు