గురు పౌర్ణమి వేడుకల్లో పల్లవి గ్రూప్స్ చైర్మన్, ఎమ్మెల్సీ మల్క కొమరయ్య

సరూర్ నగర్ లోని పల్లవి ఇంటర్నేషన్ స్కూల్ ప్రాంగణంలో గురు పౌర్ణమి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పల్లవి గ్రూప్స్ చైర్మన్, డీపీఎస్ చైర్మన్, ఎమ్మెల్సీ మల్క కొమరయ్య హజరయ్యారు.ఈ సందర్భంగా చైర్మన్ మల్క కొమరయ్య మాట్లాడుతూ విద్యార్థులకు, టీచర్స్ కు, సిబ్బందికి గురుపౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు.
మన మొదటి గురువులు అయిన తల్లి దండ్రులను ,ఉపాధ్యాయులను గౌరవించాలని విద్యార్థులకు ఆయన సూచించారు. గురు పౌర్ణమి సందర్భంగా విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక, సాంప్రదాయ కార్యక్రమాలను తిలకరించారు. అందర్ని మెచ్చుకున్నారు.