జింఖానా గ్రౌండ్ లో క్రీడా మెనాంగ్

పల్లవి, హైదరాబాద్: ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మహేంద్రహిల్స్ క్యాంపస్ నిర్వహించిన క్రీడా మెనాంగ్ కు విశేష స్పందన వచ్చింది. వార్షిక క్రీడా ఉత్సవాల్లో భాగంగా శనివారం డీపీఎస్ మహేంద్రహిల్స్ జింఖానా గ్రౌండ్స్ లో ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇంటర్నేషనల్ స్ప్రింట్ చాంపియన్ నీలపు రామిరెడ్డి, బాస్కెట్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నార్మన్ స్వరూప్, కల్నల్ అమిత్ భట్టి హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రీడల్లో సత్తా చాటిన వారికి గెస్ట్ లు ప్రశంసా పత్రాలు, పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీపీఎస్ మహేంద్ర హిల్స్ టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, విద్యార్థులు పాల్గొన్నారు.