పల్లవి మోడల్ స్కూల్ లో హర్ ఘర్ తిరంగా..!

పల్లవి, వెబ్ డెస్క్ : అల్వాల్ లోని పల్లవి మోడల్ స్కూల్ లో 79 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఆగష్టు 2వ తేదీ నుండి 15వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. 2వ తేదీ విద్యార్థులు పాఠశాల బోర్డులను జాతీయ జెండాలతో అలంకరించి, దేశ భద్రత కోసం నిరంతరం శ్రమించే జవానులకు జై జవాన్ అంటూ వారి కృషిని ప్రశంసిస్తూ సైనికులకు ఉత్తరాలు రాశారు.
ఆపరేషన్ సింధూర్ అంశంగా త్రివర్ణములతో ముగ్గుల పోటీ, వికసిత్ భారత్ పేరుతో క్విజ్, ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు మరియు పోస్టర్లు తయారు చేసి జై భారత్, జై హింద్ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు.ఆగస్ట్ 15 వ తేదీ పల్లవి మోడల్ స్కూల్ ప్రాంగణంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ముఖ్య అతిథి పూర్వ విద్యార్థిని పి. మేఘన అడ్వకేట్ గారు, ప్రిన్సిపాల్ శ్రీమతి విద్యాధరిగారు జాతీయ జెండాను ఎగరవేసి, తదనంతరం అందరూ ముక్త కంఠంతో జాతీయ గీతాన్ని ఆలపించారు.
విద్యార్థులు సైనిక నడకతో గౌరవ వందనం చేశారు. దేశభక్తి గీతాలతో, నృత్యాలతో విద్యార్థులు దేశభక్తిని చాటారు. ప్రిన్సిపాల్ విద్యాధరి గారు నేటి బాలలే రేపటి పౌరులు దేశాభివృద్ధి మీ అందరి బాధ్యత అని ఉత్తేజపూరితంగా ప్రసంగించారు. ముఖ్య అతిథి మేఘన గారు ఉపన్యసిస్తూ విద్యార్థులను అభినందిస్తూ విజేతలకు బహుమతులు అందజేశారు.ఉపాధ్యాయులు, విద్యార్థులు జాతీయ జెండాను పట్టుకొని సెల్ఫీలు తీసుకుని స్వాతంత్ర్య దినోత్సవాన్ని అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు . భారత్ మాతాకి జై! జై హింద్ నినాదాలతో పాఠశాల ప్రాంగణం దేశభక్తితో అలరారింది. విద్యార్థి సంఘ నాయకుడు అందరికి ధన్యవాదములు తెలియచేస్తూ కార్యక్రమాన్ని ముగించారు.