DPS మహేంద్ర హిల్స్ లో అన్ని క్లాసులకు అడ్మిషన్స్ స్టార్ట్..
ఆన్లైన్, ఆఫ్‌లైన్ అడ్మిషన్ విధానాన్ని స్కూల్ ప్రిన్సిపాల్ నందితా సుంకర అడ్మిన్ ఆఫీసర్, అడ్మిషన్ కౌన్సెలర్‌తో కలిసి ప్రారంభించారు.

హైదరాబాద్ లోని ఈస్ట్ మారేడుపల్లి ఏరియాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మహేంద్ర హిల్స్ 2025 – 2026 అకడమిక్ సెషన్ కోసం విజయదశమి సందర్భంగా నేటి నుంచి అన్ని తరగతులకు అడ్మిషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఆన్లైన్, ఆఫ్‌లైన్ అడ్మిషన్ విధానాన్ని స్కూల్ ప్రిన్సిపాల్ నందితా సుంకర అడ్మిన్ ఆఫీసర్, అడ్మిషన్ కౌన్సెలర్‌తో కలిసి ప్రారంభించారు.
ఈ ప్రతిష్టాత్మక సంస్థలో తమ పిల్లల కోసం అడ్మిషన్ కోరుకునే తల్లిదండ్రుల సందేహాలను తీర్చేందుకు కూడా ఏర్పాటు చేయబడింది. స్కూల్ ప్రాసెస్, విద్యా, సహ-పాఠ్య కార్యకలాపాలను తల్లిదండ్రులు వెళ్లి చూసే అవకాశం కూడా కల్పించారు.