స్టార్ కొరియోగ్రాఫర్‌పై చీటింగ్ కేసు నమోదు
బాలీవుడ్లో స్టార్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకున్న రెమో డిసౌజాపై కేసు నమోదైంది. రెమో డిసౌజా, ఆయన సతీమణి లిజెల్లేతోపాటు మరో ఐదుగురు వ్యక్తులు తనని మోసం చేసి రూ.11 కోట్లు కాజేశారని పేర్కొంటూ ఓ డ్యాన్సర్ పోలీసులను ఆశ్రయించాడు
బాలీవుడ్లో స్టార్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకున్న రెమో డిసౌజాపై కేసు నమోదైంది. రెమో డిసౌజా, ఆయన సతీమణి లిజెల్లేతోపాటు మరో ఐదుగురు వ్యక్తులు తనని మోసం చేసి రూ.11 కోట్లు కాజేశారని పేర్కొంటూ ఓ డ్యాన్సర్ పోలీసులను ఆశ్రయించాడు . 26 ఏళ్ల డ్యాన్సర్ ఫిర్యాదు మేరకు అక్టోబర్ 16న మీరా రోడ్ పోలీస్ స్టేషన్లో డిసౌజా, అతని భార్య లిజెల్, మరో ఐదుగురిపై సెక్షన్ 465 (ఫోర్జరీ), 420 (చీటింగ్) ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్ ప్రకారం, ఫిర్యాదుదారుడు, అతని బృందం ఒక డాన్స్ షోలో గెలిచిదని..అయితే ఆ బృందం తమదేనంటూ రెమో డిసౌజాతో మరికొందరు పోజులిచ్చి రూ.11.96 కోట్ల ప్రైజ్ మనీని క్లెయిమ్ చేశారని ఫిర్యాదులో తెలిపారు. ఈ కేసులో నిందితులు ఓంప్రకాష్ శంకర్ చౌహాన్, రోహిత్ జాదవ్, ఫ్రేమ్ ప్రొడక్షన్ కంపెనీ, వినోద్ రౌత్, రమేష్ గుప్తాలపై విచారణ జరుగుతోందని పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.
Related News
-
నాదర్గుల్ DPSలో SLC కార్యక్రమం
-
భారత్ – బంగ్లా మధ్య ప్రపంచ భవిష్యత్ ప్రణాళిక సమావేశం
-
పల్లవి స్కూల్లో పోటీ పరీక్షల కోసం ప్రత్యేక శిక్షణ సెషన్
-
బోయిన్ పల్లి పల్లవి స్కూల్లో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం
-
ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ టోర్నమెంట్లో పల్లవి స్కూల్ హవా
-
అల్వాల్ పల్లవి మోడల్ స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు



