Bigg Boss 8 Telugu : సానియా vs శేఖర్ బాషా : బిగ్‌బాస్‌లో అప్పుడే వార్ స్టార్ట్
గ్రాండ్ గా మొదలైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో అప్పుడే వార్ స్టార్ట్ అయింది. డే టూకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో కంటెస్టెంట్స్ శేఖర్ భాషా, సోనియా మధ్య వాగ్వివాదం జరిగింది. హౌస్ మేట్స్ లో కొందరు ఆరెంజ్‌లతో ఆడుకుంటూ ఉండగా.. సోనియా అభ్యంతరం చెప్పింది. ఎవరైతే అరెంజెస్ తో ఆడుతున్నారో వాళ్ళు మిగిలిన ఆరెంజెస్ ముట్టుకోవడానికి వీల్లేదంటూ సానియా కామెంట్ చేయగా శేఖర్ బాషా రెచ్చిపోయాడు.
ఆరెంజస్ లను ముట్టుకోకూడదని బిగ్ బాస్ ఏమైనా రూల్ పెట్టాడా అంటూ సానియాకు కౌంటర్ ఇచ్చిండు. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. శేఖర్ కామెంట్స్ కు బదులుగా సోనియా కూడా ఎక్కడ తగ్గలేదు. నీకు ఇచ్చిన వాటితో నువ్వు ఆడుకో.. కిందేసి తొక్కుకో డ్రైనేజ్‌లో వేసుకో.. టేబుల్ మీద పెట్టుకో.. కానీ దాన్ని మాత్రం వేరే వాళ్లకి ఇవ్వకు అంటూ రిప్లై ఇచ్చింది. మరోవైపు సోనియా, యాష్మి మధ్య కూడా డిబేట్ నడిచింది. ఇక హౌస్ మేట్స్ కు బిగ్ బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. మరి ఈ గేమ్ లో ఎవరు గెలిచారన్నది చూడాలి.
ఇక ఆదివారం గ్రాండ్ గా మొదలైన సీజన్ 8లో మొత్తం14 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లోకి పంపించారు నాగార్జున. ఇందులో యష్మీ గౌడ, నిఖిల్ మలియక్కల్, అభయ్ నవీన్, ప్రేరణ కంభం, ఆదిత్య ఓం, సోనియా ఆకుల, బెజవాడ బేబక్క, శేఖర్ బాషా , కిర్రాక్ సీత, నాగ మణికంఠ, పృథ్వీరాజ్, విష్ణు ప్రియ, నైనిక, అఫ్రిదీ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.



