రష్మికను చూస్తే శ్రీదేవి గుర్తొచ్చారు : నాగార్జున
పల్లవి, వెబ్ డెస్క్ : కుబేర మూవీ సక్సెస్ మీట్ లో సీనియర్ నటుడు, హీరో నాగార్జున నేషనల్ క్రష్ , స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నాపై ప్రశంసల జల్లు కురిపించారు. నాగ్ మాట్లాడుతూ ” కుబేర సినిమాలో రష్మిక నటనను చూస్తే ‘క్షణక్షణం’ మూవీలో శ్రీదేవి గుర్తుకొచ్చారు.
కుబేర మూవీ చూసిన తర్వాత రష్మిక నా క్రష్ కూడా అయిపోయారు. రష్మిక నేషనల్ క్రష్ మాత్రమే కాదు ఇకపై నాగార్జున క్రష్ అని” ఆయన తెలిపారు. ఈ సినిమాతో తనకు తర్వాత చేసే క్యారెక్టర్లపై ఓ ఐడియా వచ్చిందని అన్నారు. కుబేర మూవీలో ధనుష్ నటన గురించి ప్రత్యేక చెప్పనక్కర్లేదు. ఇప్పటికే నాలుగు జాతీయ అవార్డులను గెలుచుకున్నారు” అని నాగ్ గుర్తు చేశారు.



