వార్ 2 విడుదల – ఎన్టీఆర్, హృతిక్ సలహ..!
పల్లవి, వెబ్ డెస్క్ : బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ, పాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ వార్ 2. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం పాన్ ఇండియా ఫిల్మ్ గా ఈరోజు గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ద్వారా జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో ఎంట్రీచ్చారు. ఈ సందర్భంగా హీరోలు హృతిక్ రోషన్, ఎన్టీఆర్.. స్పాయిలర్ లకు, తమ అభిమానులకు ఓ వినతి చేశారు.
హీరో హృతిక్ రోషన్ మాట్లాడుతూ” వార్ 2′ సినిమాను ఎంతో ప్రేమతో మేము కష్టపడి తెరకెక్కించాం. ఎంతో ప్యాషన్ తో చేసిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాటిక్ దృశ్యాన్ని ఎక్సపీరియన్స్ చేయడానికి అందరూ థియేటర్లలోనే సినిమాను చూడండి. దయచేసి సినిమాలోని సీక్రెట్లు, ట్విస్ట్ లను బహిర్గతం చేయకండి అంటూ హృతిక్ రోషన్ పేర్కొన్నారు.
మరో హీరో ఎన్టీఆర్ మాట్లాడుతూ”మీరు(అభిమానులు) ‘వార్ 2’ని మొదటిసారి చూసిన ప్పుడు పొందే ఆనందం, థ్రిల్, వినోదాన్ని మిగతా వారూ పొందాలి. స్పాయిలర్లు రహస్యాలు, ట్విస్టులు రివీల్ చేయడం వల్ల మిగతా వాళ్లకు ఆ అనుభూతి ఉండదు. దయచేసి ‘వార్ 2’ కథను రహస్యంగా ఉంచండి” అని అభిమానులకు, ప్రేక్షకులకు ఆయన తెలిపారు.



