శ్రీను వైట్ల కు షాకిచ్చిన వెన్నెల కిషోర్..!
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్ కమెడియన్స్ లో ఒకరూ వెన్నెల కిషోర్. వెన్నెల కిషోర్ గత కొంతకాలంగా వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు. తాజాగా ఓ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇంటర్వూలో వెన్నెల కిషోర్ మాట్లాడుతూ తన కేరీర్ లో ఎదురైన ఓ సంఘటనను పంచుకున్నారు. ఆ ఇంటర్వూలో మాట్లాడుతూ ‘ తాను ఇప్పటివరకూ అనేక సినిమాల్లో నటించాను.
అయినప్పటికి నా డ్రీమ్ రోల్ మాత్రం దూకుడు సినిమాలోని పోలీస్ పాత్రనేనని ‘ ఆయన చెప్పారు. ఆ చిత్రంలో మహేష్ బాబు సరసన మంచి పాత్ర రావడంతోనే తన కల నెరవేరిందన్నారు. ఆ సినిమా కోసం దర్శకుడు శ్రీను వైట్ల కథ చెప్పిన సమయంలో పాత్ర కోసం బరువు తగ్గాలని చెప్పారు. పోలీస్ పాత్ర సన్నగా కన్పించాలి, అవసరమైతే సర్జరీ చేయించుకోవాలని కూడా చెప్పారు.
కానీ తాను సర్జరీ జోలికి వెళ్లలేదని వెన్నెల కిషోర్ తెలిపారు. సర్జరీకి పోకుండా వ్యాయామాలు చేసిన కానీ అనుకున్నంత సన్నబడలేదని, అయినా తాను నటించానని, అదే పాత్రకు కలిసి వచ్చిందని చెప్పారు. ఆమూవీలో పాత్రకు ప్రశంసలతో పాటు పలు అవకాశాలు సైతం వచ్చాయని పేర్కొన్నారు.



