త్రివిక్రమ్ డైరెక్షన్ లో వెంకీ..!

పల్లవి, వెబ్ డెస్క్ : హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో బడా నిర్మాత దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ నిర్మాతగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి లు హీరోయిన్లుగా తెరకెక్కన మూవీ సంక్రాంతికి వస్తున్నాం.
ఈ సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించి ఏకంగా మూడోందల కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది . ఈ సినిమా తర్వాత విక్టరీ వెంకటేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో మూవీలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ మూవీ షూటింగ్ ఆగస్టు నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. అయితే, త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకీ నటించడం ఇదే మొదటి సినిమా. గతంలో వెంకీ నటించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటల రచయితగా పని చేశారు.