ఓ స్టార్ హీరోతో త్రిష పెళ్లి..!
పల్లవి, వెబ్ డెస్క్ : ఇటీవల నలబై ఏండ్లు పూర్తి చేసుకున్న చెన్నై భామ .. అందాల రాక్షసి త్రిష పెళ్లి గురించి ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తమిళ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో శింబును హీరోయిన్ త్రిష పెళ్ళి చేసుకోనున్నదని ఆ వార్తల సారాంశం. గతంలో వీరిద్దరూ ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో వీరిద్దరూ పక్కపక్కన కూర్చుని.. నవ్వుతున్న ఓ ఫోటోను వైరల్ చేస్తూ ” గత కొంతకాలంగా త్రిష శింబు ప్రేమలో ఉన్నారు.
త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఇరువైపు కుటుంబ సభ్యులు వీరి కళ్యాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని” పోస్టులు పెడుతున్నారు. అయితే, ఇంతవరకూ ఎవరూ ఈ వార్తలపై స్పందించలేదు కాబట్టి అప్పటివరకూ కేవలం ఊహగానాలే అని అనుకోవచ్చు అని సినీ క్రిటిక్స్ ఆ వార్తలను కొట్టిపారేస్తున్నారు.
మరోవైపు గతంలో తన సహచర నటుడైన విజయ్ అనే తమిళ హీరోతో త్రిష ఎఫైర్ నడిపింది. పెళ్ళి కూడా చేసుకోబోతుంది అని అప్పట్లో వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. ఆ తర్వాత అవి వట్టిదే అని తేలింది. చూడాలి మరి తాజా వార్తల్లో నిజం ఎంతో.. అబద్ధం ఎంతో తెలియాలి.



