‘విశ్వంభర’ నుండి త్రిష ఫస్ట్ లుక్
పల్లవి, వెబ్ డెస్క్ :
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో .. మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర. ఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్ విడుదలైంది.
హీరోయిన్ త్రిష పుట్టిన రోజు కానుకగా విశ్వంభర లో ఆమె పాత్ర “అవని” ని పరిచయం చేస్తూ మూవీ మేకర్స్ పోస్టర్ ను యూవీ క్రియేషన్స్ అధికార ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్టు చేశారు. ఈ నయా లుక్ లో త్రిష సాంప్రదాయ చీరకట్టులో అందర్ని ఆకట్టుకునేలా ఉంది.
కాగా, సోషియో ఫాంటసీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాతలు వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్నారు. స్టాలిన్ మూవీ తర్వాత మెగాస్టార్ సరసన మరోసారి త్రిష ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు.




