నందమూరి కుటుంబంలో విషాదం..!
పల్లవి, వెబ్ డెస్క్ : ప్రముఖ సీనియర్ నటుడు, లెజండ్రీ విశ్వవిఖ్యాత హీరో దివంగత మాజీ సీఎం నందమూరి తారకరామారావు కుటుంబంలో పెను విషాదం చోటు చేసుకుంది. ఎన్టీఆర్ పెద్దకుమారుడు నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ (73) కన్నుమూశారు.
గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పద్మజ హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు పద్మజ సోదరి అవుతారు. బ్రీత్ హీరో చైతన్య కృష్ణకు పద్మజ తల్లి. ఈ విషయం తెలుసుకున్న ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ కు హుటాహుటిన బయలుదేరారు.



