సన్నబడిన రాశి.. ఫ్యామిలీతో కలిసి తిరుమల శ్రీవారి సేవలో
సీనియర్ హీరోయిన్ రాశి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు
సీనియర్ హీరోయిన్ రాశి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం అందించగా… .ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.
ఆలయం బయట రాశితో అభిమానులు ఫోటోలు దిగారు. దీనికి సంబంధిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇప్పుడు రాశి చాలా సన్నబడ్దారు. పెళ్లాయ్యక సినిమాలకు దూరంగా ఉన్న రాశి… చాలా లావయ్యారు. ఆ తరువాత రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ కొన్ని సినిమాలు మాత్రమే చేశారు. మరి మళ్లీ ఆమె సినిమాల్లో యాక్టివ్ అవుతారో లేదో చూడాలి.
1989 లో వచ్చిన మమతల కోవెల సినిమాతో 9 సంవత్సరాల వయస్సులో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు రాశి. 1997 లో శుభాకాంక్షలు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. రాశి చెన్నైలో జన్మించింది. ఆమె తల్లిది భీమవరం, తండ్రిది చెన్నై. ఈమెకు ఒక అన్నయ్య ఉన్నాడు.సినిమాల్లోకి వచ్చే ముందు పదో తరగతి దాకా చదివిన రాశి.. . సినిమాలలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చాక ఆంగ్ల సాహిత్యంలో బిఎ చేసింది.



