నారా రోహిత్‌తో ఎంగేజ్మెంట్ .. ఎవరీ సిరీ లెల్ల.. బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
ఈ క్రమంలో ఎవరీ సిరీ లెల్ల ఎవరు ఆమె నేపథ్యం ఎంటో తెలుసుకోవడానికి చాలామంది నెటిజన్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈమె అసలు పేరు శిరిష లెల్ల.
టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ప్రతినిధి 2 హీరోయిన్ సిరీ లెల్లతో ఆయన పెళ్లి జరగనుంది. 2024 ఆక్టోబర్ 13వ తేదీ ఉదయం హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్లో వీరి ఎంగేజ్మెంట్ వేడుక గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు, ఇరు కుటుంబాల పెద్దలతోపాటు, అత్యంత సన్నిహితులు హాజరయ్యారు. వీరి ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. డిసెంబర్ లో వీరి వివాహం ఉంటుందని సమాచారం.
ఈ క్రమంలో ఎవరీ సిరీ లెల్ల ఎవరు ఆమె నేపథ్యం ఎంటో తెలుసుకోవడానికి చాలామంది నెటిజన్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈమె అసలు పేరు శిరిష లెల్ల. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని రెంటచింతల.. తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారి కాగా తల్లి గృహిణి.
శిరీషాకు నలుగురు తోబుట్టువులు. పెద్దమ్మాయి శ్రీలక్ష్మీ రెంటచింతలలో అంగన్వాడీ సూపర్వైజర్. రెండో అమ్మాయి భవానీ పెళ్లి చేసుకుని ఆమెరికాలో, మూడో అమ్మాయి ప్రియాంక వివాహం చేసుకుని హైదరాబాద్ లో స్థిరపడ్డారు. ప్రియాంక వద్ద ఉంటూ శిరీషా సినిమా ప్రయత్నాలు చేశారు.

ఆస్ట్రేలియాలో మాస్టర్స్ కంప్లీట్ చేసిన సిరీ లెల్లకు ముందునుంచి సినిమాలంటే చాలా ఇష్టం కానీ ఇంట్లో వాళ్లు నో చెప్పడంతో స్టడీ పైన ఫోకస్ చేశారు. ఆస్ట్రేలియాలో మాస్టర్స్ కంప్లీట్ చేశాక ఇండస్ట్రీలో హీరోయిన్ గా ట్రై చేస్తానంటే కూడా ఆమె పేరెంట్స్ ఒప్పుకోలేదు. పైగా పెళ్లి చేసుకో అని ఓపెన్ గా చెప్పేశారు.

కానీ రెండేళ్లు ఇండస్ట్రీలో హీరోయిన్ గా ట్రై చేస్తానని అప్పటికి అవకాశాలు రాకపోతే వదిలేస్తానని ఇంట్లో పర్మిషన్ తీసుకుని మరీ మూవీస్ కోసం ట్రై చేశారు సిరీ. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన సిరీ .. చాలా సినిమాలకు ఆడిషన్స్ ఇచ్చారు. ఫైనల్ గా టీవీ5 మూర్తి తెరకెక్కించిన ప్రతినిధి2 మూవీలో హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యారు. ఇందులో కూడా ఆమె పాత్ర సిరీనే కావడం విశేషం. ఈ షూటింగ్ టైమ్ లోనే హీరో నారా రోహిత్ తో పరిచయం ప్రేమకు దారి తీసింది.
వీరి జంట బాగుందని స్వయంగా నారా భువనేశ్వరి ఈ సంబంధం మాట్లాడారట. నారా రోహిత్ వయస్సు 39 ఏళ్లు కాగా.. సిరీ లెల్ల వయస్సు 29 ఏళ్లు. హీరోయిన్ గా కాబోయే భర్తతో స్ర్కీన్ పైన కనిపించిన సిరీ .. తల్లిదండ్రులు అన్నట్లుగా పెళ్లి చేసుకోని త్వరలో మరిన్ని బాధ్యతలు తీసుకోబోతుంది.
Related News
-
బతుకమ్మ వేడుకల పోస్టర్ ఆవిష్కరణ
-
అమ్మవారి దీక్షను స్వీకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్
-
మోదీ జీవితం అందరికీ ఆదర్శం – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
-
సింగరేణి కార్మికులకు దసరా బోనస్ – ఉపముఖ్యమంత్రి భట్టీ
-
‘అమ్మ పేరుతో ఒక మొక్క’ ను నాటండి – అరూరి రమేష్
-
ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో పెట్టుబడులు పెట్టండి-మంత్రి శ్రీధర్ బాబు



