రాజేంద్ర ప్రసాద్ ఇంట విషాదం.. గుండెపోటుతో కూతురు మృతి
తెలుగు నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. కూతురు గద్దె గాయత్రి(38) గుండెపోటుతో శనివారం మరణించారు.
తెలుగు నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. కూతురు గద్దె గాయత్రి(38) గుండెపోటుతో శనివారం మరణించారు. నిన్న కార్డియాక్ అరెస్టుకు గురికావడంతో హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె శనివారం కన్నుమూశారు. రాజేంద్ర ప్రసాద్‌కు ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు.

గాయత్రి మరణంతో రాజేంద్రప్రసాద్ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గాయత్రికి భర్త, ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. గాయత్రి కి కూతురు మహానటి సినిమాలో చిన్ననాటి సావిత్రి పాత్రను పోషించారు. ఇక ఆమె భర్త మహేంద్ర కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. గాయత్రి న్యూట్రిషియన్ గా సలహాలు ఇస్తున్నారు. రేపు గాయత్రి అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది.
ఇక చిన్న వయసులోనే తమ కళ్ల ముందే కూతురు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడాన్ని చూసిన రాజేంద్ర ప్రసాద్ దంపతులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. గాయత్రి మృతదేహాన్ని రాజేంద్ర ప్రసాద్ నివాసం ఉంటున్న కేపీహెచ్‌బీ కాలనీలోని ఫార్చ్యూన్ విల్లా 226లో సందర్శనకు ఉంచారు. రాజేంద్రప్రసాద్ విజయ చాముండేశ్వరిని వివాహం చేసుకున్నాడు. ఈమె సినీ నటి రమాప్రభకు మేనకోడలు.



