సమంత విడాకుల ఇష్యూ..నాగార్జున సంచలన ట్వీట్!
కొండా సురేఖ వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఫైర్ అయ్యారు.
నాగ చైతన్య–సమంత విడాకులపై బుధవారం తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో కలకం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి కొండా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా హీరో నాగార్జున స్పందించారు. నాగార్జున తన ఎక్స్ లో పెట్టిన పోస్టులో “గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవి లో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కోరుతున్నాను” అని తెలిపారు.
మరోవైపు, కొండా సురేఖ వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఫైర్ అయ్యారు. “ఏంటీ సిగ్గులేని రాజకీయాలు… సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూప ?”అంటూ కొండా సురేఖని ఉద్దేశిస్తూ ప్రకాష్ రాజ్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.
కాగా,అంతకుముందు సమంత–నాగచైతన్య విడాకులకు మాజీ మంత్రి కేటీఆరేనని కొండా సురేఖ ఆరోపించింది. సమంత జీవితం అన్యాయం కావడానికి వంద శాతం కేటీఆరే కారణమన్నారు. ఎన్ కన్వెన్షన్ ని కూల్చడకుండా ఉండాలి అంటే సమంతనని తన దగ్గరకి పంపాలి అని అధికారంలో ఉన్న సమయంలో కేటీఆర్ అక్కినేని ఫ్యామిలీపై ఒత్తిడి తెచ్చారని..దీంతో నాగార్జున వాళ్లు కేటీఆర్ దగ్గరకి వెళ్లాలని సమంతని ఒత్తిడి చేశారని..అయితే సమంత అందుకు నిరాకరించిందని..దీంతో తాము చెప్పింది వింటే వినే లేకుంటే వెళ్లిపో అని ఆమెకు విడాకులు ఇచ్చారని బుధవారం తెలంగాణ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది హీరోయిన్లు తొందరగా పెళ్లి చేసుకోని సినిమాల నుంచి తప్పుకోవడానికి కారణం కేటీఆర్ అని మంత్రి అన్నారు. చాలామంది హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేసి వాళ్ల జీవితాలతో కేటీఆర్ అడుకున్నడని మంత్రి చెప్పారు. కేటీఆర్ కు హీరోయిన్ల జీవితాలతో ఆడుకోవడం అలవాటని.. వారికి డ్రగ్స్ అలవాటు చేసింది ఆయనేనని సంచలన వ్యాఖ్యలు చేశారు.



