అన్నపూర్ణ స్టూడియోకు 50 ఏళ్లు.. నాగార్జున ఎమోషనల్ వీడియో
అక్కినేని నాగార్జున గురించి స్పెషల్గా చెప్పనక్కర్లుదు. అక్కినేని నాగేశ్వరరావు తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన పాపులారిటీ సంపాదించ్చుకున్నాడు.
అక్కినేని నాగార్జున గురించి స్పెషల్గా చెప్పనక్కర్లుదు. అక్కినేని నాగేశ్వరరావు తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన పాపులారిటీ సంపాదించ్చుకున్నాడు. ఇదిలా ఉంటే అక్కినేని నాగేశ్వరరావు ఆయన సతీమణి పేరుమీద అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన విషయం తెల్లిసిందే. నేటికి ఆ స్టూడియో నిర్మించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అక్కినేని నాగార్జున ఒక ప్రత్యేక వీడియోను షేర్ చేశారు.
“బండలు, రాళ్ళురప్పలున్న చోట అన్నపూర్ణ స్టూడియోకు పునాదులు పడ్డాయి. సరిగ్గా సంక్రాంతి పండుగ రోజునే స్టూడియో ప్రారంభమైంది. అప్పటి నుండి ప్రతి సంక్రాంతికి ఇక్కడకు వచ్చి అందరితోపాటు కలిసి టిఫెన్ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఎంతో మందికి ఏఎన్నాఆర్ స్ఫూర్తి. ఈ స్టూడియోలోని ప్రతీ స్థలం నా తల్లిదండ్రుల ఫేవరెట్ స్పాట్. ప్రతి పురుషుడి విజయం వెనుక ఓ మహిళ ఉంటుంది. అలా నా తండ్రి విజయం వెనుక మా అమ్మ అన్నపూర్ణమ్మ ఉన్నారు” అంటూ చెప్పుకొచ్చాడు నాగార్జున. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



