విడుదలకు ముందే ” కూలీ” సంచలనం ..!
పల్లవి, వెబ్ డెస్క్ : తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్, టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం ‘కూలీ’.. మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, మలయాళంలో స్టార్ యాక్టర్ సౌబీన్ షాహిర్, స్టార్ హీరోయిన్లు శృతిహాసన్, పూజా హెగ్డే, సత్య రాజ్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫి, అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ ను అందిస్తున్నారు.
అయితే ఈ సినిమా ఈ నెల పద్నాలుగో తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో సినిమా విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తోంది. మరి ముఖ్యంగా ఈ సినిమా కోసం నటీనటులు అందుకుంటున్న రెమ్యూనేషన్ గురించి ప్రస్తుత టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, భారతీయ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రముఖ డెక్కన్ హెరాల్డ్ నివేదిక ప్రకారం, ఈ చిత్రంలో ‘దేవా’ పాత్ర పోషిస్తున్న రజినీకాంత్ ఏకంగా రూ. 200 కోట్ల భారీ రెమ్యూనేషన్ తీసుకుంటున్నారని టాక్ .
మొదట రూ. 150 కోట్లకు ఒప్పందం కుదిరినప్పటికీ, సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో ఉండటంతో నిర్మాతలు సూపర్ స్టార్ పారితోషికాన్ని పెంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ చిత్రం దర్శకుడు లోకేష్ కనగరాజ్‌కు రూ. 50 కోట్లు, ‘జైలర్’ తర్వాత మరోసారి రజినీతో పనిచేస్తున్న సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌కు రూ. 15 కోట్లు చెల్లించినట్లు ఆ వార్తల సారాంశం .
స్టార్ హీరో నాగార్జున ‘సైమన్’ అనే కీలక పాత్ర కోసం రూ. 10 కోట్లు అందుకుంటున్నారని చెబుతున్నారు. ఇక బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ కు రూ. 20 కోట్లు ముట్టినట్లు సమాచారం. ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న సత్యరాజ్ (రాజశేఖర్), కన్నడ స్టార్ ఉపేంద్ర (కలీష) చెరో రూ. 5 కోట్లు, కథానాయిక శ్రుతిహాసన్ (ప్రీతి) రూ. 4 కోట్లు తీసుకుంటున్నారని ట్రేడ్ వర్గాల సమాచారం.



