కూలీ కలెక్షన్ల వర్షం..!
పల్లవి, వెబ్ డెస్క్ : తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా అక్కినేని నాగార్జున విలన్ గా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ కూలీ.సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్, భారతీయ సినిమా కళానిధి మారన్ నిర్మాతగా వ్యవహరించారు. మ్యూజిక్ సంచలనం అనిరుధ్ సంగీతం అందించాడు.. ఆగస్టు పద్నాలుగో తారీఖున ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘కూలీ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.
ఈ చిత్రం విడుదలైన తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.151 కోట్లు వసూలు చేసి, తమిళ సినీ చరిత్రలోనే అత్యధిక ఓపెనింగ్ సాధించిన చిత్రంగా సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇండియన్ మార్కెట్‌లోనూ ‘కూలీ’ భారీ వసూళ్లను నమోదు చేసింది. భారత్‌లో తొలిరోజు రూ.65 కోట్ల నికర వసూళ్లతో, విజయ్ నటించిన ‘లియో’ (రూ.66 కోట్లు) తర్వాత రెండో అతిపెద్ద తమిళ ఓపెనర్‌గా నిలిచింది. దేశవ్యాప్తంగా గ్రాస్ వసూళ్లు సుమారు రూ.80 కోట్లుగా ఉన్నాయి.
ఇక విదేశాల్లో అయితే ‘కూలీ’ హవా మాములుగా లేదు. ఉత్తర అమెరికాలో 3.04 మిలియన్ డాలర్లు, యూకేలో 124 వేల పౌండ్లు, ఆస్ట్రేలియాలో 5.35 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్ల వసూళ్లతో తమిళ చిత్రాల్లో సరికొత్త ఆల్ టైమ్ రికార్డులను సృష్టించింది.
ఈ అసాధారణ వసూళ్లతో ‘కూలీ’ చిత్రం, ‘జవాన్’ (రూ.126 కోట్లు), ‘యానిమల్’ (రూ.116 కోట్లు), ‘పఠాన్’ (రూ.104 కోట్లు) వంటి బాలీవుడ్ భారీ చిత్రాల తొలిరోజు వసూళ్లను అధిగమించింది. భారతీయ సినిమాల్లో టాప్-10 అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల జాబితాలో సగర్వంగా స్థానం సంపాదించింది.



