జానీ మాస్టర్ వ్యవహారంపై ..మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ సిటీ పోలీస్, బెంగళూరు నగర పోలీస్‌లకు అభినందనలు తెలిపారు మనోజ్.
టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారంపై నటుడు మంచు మనోజ్ ఎక్స్ వేదికగా స్పందించారు. జానీ మాస్టర్.. కెరీర్ పరంగా ఈ స్థ్థాయికి వచ్చేందుకు మీరు ఎంతలా శ్రమించారో అందరికీ తెలుసునని.. ఈరోజు ఆయనపై ఇలాంటి ఆరోపణలు రావడం చూస్తుంటే తన హృదయం ముక్కలవుతుదన్నారు. నిజం ఎప్పటికైనా బయటపడుతుందన్నారు. తప్పు, ఒప్పు ఎవరిది అనేది చట్టం నిర్ణయిస్తుందని.. ఒక మహిళ తన స్వరాన్ని వినిపించినప్పుడు పారిపోవడం అనేది సమాజానికి, రానున్న తరాలకు ఒక ప్రమాదకరమైన సందేశాన్ని ఇస్తుందన్నారు. కేసు విషయంలో త్వరితగతిన స్పందించి చర్యలు తీసుకున్న పోలీసులకు అభినందనలు తెలిపారు మనోజ్. జానీ మాస్టర్.. నిజాన్ని ఎదుర్కొండి.. మీరు ఏ తప్పూ చేయకపోతే పోరాటం చేయండి.. మీరు దోషి అయితే.. దానిని అంగికరించండి అని మంచె మనోజ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
ఇచ్చిన మాట ప్రకారం ఉమెన్స్ ప్రొటెక్షన్ సెల్‌ని వెంటనే సిద్ధం చేయాలని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ను మంచు మనోజ్ కోరారు. దీనికంటూ ప్రత్యేకంగా సోషల్‌మీడియా అకౌంట్స్ ఏర్పాటు చేయాలన్నారు. తాము ఒంటరిగా లేమని.. తమ ఆవేదన, బాధలను వింటామనే విషయాన్ని సినీ పరిశ్రమలోని ప్రతి మహిళకు తెలియజేయఆలన్నారు. న్యాయం, గౌరవం అనేది మాటల్లో మాత్రమే కాకుండా చేతల్లోనూ చూపించే విధంగా మెరుగైన సమాజాన్ని నిర్మిద్దాం. కుమార్తె, సోదరి, తల్లి.. ఇలా ప్రతి మహిళ కోసం ఈ పోరాటం. వారికి అన్యాయం జరగకుండా చూద్దాం అని మనోజ్ పిలుపునిచ్చారు.
@AlwaysJani master , you’ve fought your way to the top, and everyone knows the struggles you’ve overcome. But today, seeing these serious allegations against you is heartbreaking. The truth will always come out, and the law will decide who is right and wrong. Running away,…
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 19, 2024
కాగా,జానీ మాస్టర్.. గత కొంతకాలంగా తనను లైంగికంగా వేధిస్తున్నట్లు ఆయన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేసే శ్రేష్ఠ వర్మ అనే యువతి మూడు రోజుల క్రితం చేసిన ఫిర్యాదుతో హైదరాబాద్ లోని నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. నార్సింగి పోలీసులు జానీ మాస్టార్ పై పోక్సో చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తనపై ఆరోపణలు రావడంతో జానీమాస్టర్ పరారయ్యారు. ఆయనను పట్టుకునేందుకు పోలీసు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. నాలుగు ప్రత్యేక బృందాలుగా జానీ మాస్టర్ కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. జానీ మాస్టర్ ని ఎట్టకేలకు ఇవాళ గోవాలో అరెస్ట్ చేసిన సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అతనిని హైదరాబాద్ తరలిస్తున్నారు.



