వీకెండ్ మస్తీ.. OTTలో బ్లాక్ బస్టర్ సినిమాలు
ఓటీటీలు ఈ వారం సాలిడ్ ప్రాజెక్ట్ ఆడియన్స్ ను అలరించనున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు బ్లాక్ బస్టర్ సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. వాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది దేవర.
ఓటీటీలు ఈ వారం సాలిడ్ ప్రాజెక్ట్ ఆడియన్స్ ను అలరించనున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు బ్లాక్ బస్టర్ సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. వాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది దేవర. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఈ సినిమా థియేటర్లో భారీ విజయాన్ని సాధించింది. ఇక ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్దమయ్యింది ఈ మూవీ. నవంబర్ 8వ తేదీ నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతుంది.
ఇక సూపర్ స్టార్ రజనీకాంత్, జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన వేట్టయాన్ సినిమా తమిళనాట భారీ విజయాన్ని సాధించింది.
కానీ, తెలుగులో పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. కాబట్టి ఓటీటీలో చూడటం కోసం తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కూడా ఈనెల 8న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.
ఇక సమంత నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్ : హనీ బనీ’. ఈ సిరీస్ నవంబర్ 7 నుండి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కాబోతోంది. సమంత గతంలో నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 ఏ స్థాయి విజయాన్ని సాధించిందో తెల్సిందే. అదే రేంజ్ లో సిటాడెల్ కూడా విజయాన్ని సాధిస్తుంది అని మేకర్స్ భావిస్తున్నారు. ఇక మలయాళ నటుడు టోవినో థామస్ హీరోగా వచ్చిన ఏఆర్ ఎం సినిమా కూడా నవంబర్ 8న స్ట్రీమింగ్ కి రానుంది. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.



