దేవర్ – 2 పై బిగ్ అప్ డేట్
పల్లవి, వెబ్ డెస్క్ : పాన్ ఇండియా స్టార్ హీరో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే..
అంతేకాదు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీని సృష్టించింది. తాజాగా దీని సీక్వెల్ ‘దేవర-2’ స్క్రిప్ట్ డైలాగ్ వెర్షన్ తో సహా పూర్తిగా రెడీ అయినట్లు టాలీవుడ్ సినీవర్గాలు వెల్లడించాయి.
ఎన్టీఆర్ కథ విని, దీనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే వెంటనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే.



