రజనీకాంత్ తో కమల్ హాసన్ భేటీ..!

పల్లవి, వెబ్ డెస్క్ : విశ్వ నటుడు, దర్శక నిర్మాత మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ ఇటీవల రాజ్యసభ కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. రాజ్యసభకు నామినేట్ అయిన సందర్భంగా తన స్నేహితుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ తో హీరో కమల్ హాసన్ భేటీ అయ్యారు.
తన సరికొత్త రాజకీయ ప్రయాణం గురించి పలు విషయాల గురించి స్నేహితుడు రజనీకాంత్ తో చర్చించినట్లు ఎక్స్ లో తెలిపారు. దీనికి సంబంధించిన ఫోటోలను కమల్ హాసన్ తన ట్విట్టర్ అకౌంటులో పోస్టు చేశారు. ఈ సందర్భంగా కమల్ ను రజనీకాంత్ అభినందించి ఆల్ ది బెస్ట్ తెలిపారు. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ మూవీలో నటిస్తున్నరు.