వార్ 2 అందుకే ఒప్పుకున్న : Jr ఎన్టీఆర్
WAR 2 ,Official Trailer
పల్లవి, వెబ్ డెస్క్ : అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న ఇద్దరు అగ్రహీరోల లేటెస్ట్ మూవీ వార్ 2′ . తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీ తర్వాత నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ఇది. మరోవైపు బాలీవుడ్ స్టార్ హీరో అయిన హృతిక్ రోషన్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్శల్ తెరకెక్కిస్తుంది. ఈ సినిమా ఈ నెల ఆగస్టు పద్నాలుగో తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ క్రమంలో ప్రముఖ మ్యాగజైన్ ఎస్క్వైర్ ఇండియా తాజా ఎడిషన్ కవర్ ఫేజీపై జూనియర్ ఎన్టీఆర్ ఫోటోను ముద్రించింది. ఆ మ్యాగజైన్ కు హీరో ఎన్టీఆర్ ఇచ్చిన ఇంటర్వూలో పలు ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా హీరో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ వార్ -2 కోసం భాషతో సంబంధం లేకుండా అందరం కల్సి పని చేశాము. ఉత్తరాది, దక్షిణాది టెక్నిషియన్స్ అందరూ దీనికోసం హార్డ్ వర్కు చేశారు. ఇకపై బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ మాలీవుడ్ అంటూ ఏ ఉడ్ లేదు. మనమంతా ఒక్కటే ఇండస్ట్రీ అది భారత్ ఇండస్ట్రీ. భారతీయ చిత్ర పరిశ్రమగా అందరం గుర్తించాలి. ఇలా తీస్తే సినిమాలు హిట్ అవుతాయి అనే ప్రత్యేక ఫార్ములా అంటూ ఏముండదు. ఇదే విషయాన్ని ఎస్ఎస్ రాజమౌళి నిరూపించారు.
వార్ 2 ను ఎంచుకోవడానికి ప్రధాన కారణం దాని స్క్రిప్ట్ . బలమైన కథతో ఇది రూపుదిద్దుకుంది. అందుకే హృతిక్ రోషన్ తో కల్సి పని చేయడానికి ఒప్పుకున్నాను అని సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆ ఇంటర్వూలో ఇంకా మాట్లాడుతూ తానోక నటుడ్ని మాత్రమే కాదని గొప్ప చెప్ అని కూడా చెప్పుకొచ్చారు. నా సతీమణి ప్రణతి కోసం నా స్నేహితుల కోసం వంట చేయడం నాకు ఎంతో ఇష్టం. పునుగులు బాగా వేస్తాను. అలా అని నేను వండే బిర్యానీ కూడా నాకు నచ్చుతుందని తెలిపారు. జీవితంలో ఇప్పటివరకు తాను ఏది ప్లాన్ చేసుకోలేదు. అందివచ్చిన అవకాశాన్ని నిజాయితీగా అందుకుని దానికోసం పని చేస్తాను అని ఆయన తెలిపారు.



