Shocking: హీరో జీవాకు రోడ్డు ప్రమాదం.. నుజ్జు నుజ్జు అయిపోయిన కారు!
తమిళ హీరో జీవా రోడ్డు ప్రమాదానానికి గురయ్యారు.
తమిళ హీరో జీవా రోడ్డు ప్రమాదానానికి గురయ్యారు. బుధవారం ఉదయం హీరో జీవా తన కుటుంబంతో కలిసి చెన్నై నుంచి సేలం వెళ్తుండగా..కన్నియమూర్ వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన ఉన్న బారికేడ్లను ఢీకొట్టింది. కన్నియమూర్ దగ్గరకు రాగానే ఆకస్మాత్తుగా ఎదురుగా వచ్చిన బైక్ ను తప్పించబోయేందుకు యత్నించగా.. ఆయన కారు రోడ్డు పక్కన ఉన్న బారికేడ్లను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో జీవాతోపాటు ఆయన భార్య సుప్రియకు స్వల్పంగా గాయలైట్లు తెలుస్తోంది. వారిని ట్రీట్మెంట్ కోసం దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. జీవాకు రోడ్డు ప్రమాదం జరిగిందని తెలియడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు, కామెంట్స్ పెడుతున్నారు.
కాగా, హీరో జీవా తెలుగు ఆడియన్స్ కి కూడా సుపరిచితుడే. రంగం సినిమాతో తెలుగువారికి దగ్గరైన జీవా.. ఈ ఏడాది యాత్ర 2 సినిమాతో మరింత చేరువ అయ్యాడు. యాత్ర 2లో ఏపీ మాజీ సీఎం జగన్ పాత్రలో జీవా నటనకు మంచి మార్కులే పడ్డాయ్.



