మెగాస్టార్ సినిమాలో స్టార్ హీరో..!

పల్లవి, వెబ్ డెస్క్ : వినడానికి వింతగా …కొత్తగా ఉన్న ఇది నిజం అంటున్నారు ఫిల్మ్ నగర్ వర్గాలు. ఇటీవల సంక్రాంతికి విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి మెగాస్టార్, సీనియర్ స్టార్ హీరో చిరంజీవితో ఓ సరికొత్త మూవీకి శ్రీకారం చుట్టారు.
మెగా 157పేరుతో తెరకెక్కుతున్నా ఈసినిమాలో స్టార్ సీనియర్ హీరోయిన్ నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు.
అయితే, తాజాగా ఈ చిత్రంలో సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు వార్తలు విన్పిస్తోన్నాయి.. ఈ మూవీలో వెంకీ దాదాపు ఆర్ధగంట పాటు స్క్రీన్ ను పంచుకోనున్నట్లు ఆ వార్తల సారాంశం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.