శ్రీలీల రికార్డ్.. కిస్సిక్ కోసం రూ.2 కోట్లు
లేటెస్ట్ బ్యూటీ సెన్సేషన్ శ్రీలీలకు యూత్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుసగా క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్స్ లిస్టులోకి చేరిపోయింది.

లేటెస్ట్ బ్యూటీ సెన్సేషన్ శ్రీలీలకు యూత్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుసగా క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్స్ లిస్టులోకి చేరిపోయింది. ప్రస్తుతం ఆమె మాస్ రాజా రవితేజతో మాస్ జాతర సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ తో ఐటెం సాంగ్ చేసే అవకాశాన్ని దక్కించుకుంది.
ఇటీవలే అధికారిక ప్రకటన వచ్చిన ఈ సాంగ్ పై ఆడియన్స్ లో మంచి అంచనాలే ఉన్నాయి. అయితే “కిస్సిక్” అంటూ సాగే ఆ మాస్ సాంగ్ కోసం శ్రీలీల ఏకంగా రూ.2 కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకొంటోందట. ప్రస్తుతం ఈ న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం తెలిసిన నెటిజన్లు 5 నిమిషాలకే అంత డబ్బు తీసుకుంటుందా అని షాక్ అవుతున్నారు.