ఏడాదిన్నరగా ఇంటికి వెళ్లని రష్మిక మందన్నా

పల్లవి, వెబ్ డెస్క్ : తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఓ ఇంటర్వూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆ ఇంటర్వూలో హీరోయిన్ రష్మిక మాట్లాడుతూ ‘ ఏడాదిన్నరగా ఇంటికి వెళ్లలేదు. స్నేహితులను కలవలేదు. వీకాఫ్ కోసం ఏడుస్తున్నాను’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
రష్మిక ఇంకా మాట్లాడుతూ ‘ నాకంటే పదహారు ఏళ్లు చిన్నదైన పదమూడేండ్ల సోదరితో ఉండలేకపోయాను. ఆమె ఇప్పుడు నాకంటే ఎత్తు ఉంది. ఆమె జర్నీని చూడలేకపోయా. కెరీర్ లో రాణించాలంటే వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేయాలి. కొన్నింటిని వదులుకోవాలని అమ్మ చెబుతుంటుంది. అయితే ఆరెండింటినీ సమన్వయం చేసేందుకు కష్టపడుతున్నా’ అని పేర్కొన్నారు.