నాగార్జునపై చిరంజీవి ప్రశంసల జల్లు

పల్లవి, వెబ్ డెస్క్ : కుబేర మూవీ సక్సెస్ మీట్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జునపై ప్రశంసల వర్షం కురిపించారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ” కింగ్ నాగార్జున తనకు అన్ని విషయాల్లో ఇన్ స్పిరేషన్ అని ” అన్నారు. కింగ్ నాగార్జున నుంచి ఎంతో నేర్చుకోవచ్చని చెప్పారు.
‘ అందం, ఆరోగ్యం ,మనస్తత్వం, స్థితిప్రజ్ఞత వంటి విషయాల్లో నాగార్జునే నాకు ఆదర్శం. నాకు రోల్ మోడల్ . నాగ్ లాగా నేనూ కుబేర లాంటి సినిమాలు చేస్తానేమో.. ఈ మూవీలో ఆయన నటన నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఏమి జరిగిన ఎప్పుడు ఒకేలా ఉండటం ఎలాగో నాగార్జునను చూసి నేర్చుకోవచ్చు” అని అన్నారు.