సమంత కీలక వ్యాఖ్యలు.
పల్లవి, వెబ్ డెస్క్ : స్వేచ్ఛను పొందడమే విజయం అని తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటి, ఇటీవల నిర్మాతగా అరంగేట్రం చేసిన స్టార్ హీరోయిన్ సమంత అన్నారు.
ఓ ప్రముఖ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో సమంత మాట్లాడుతూ ” గత రెండేళ్లుగా నా సినిమా రిలీజ్ కాలేదు. ఆ సమయంలో తాను స్వేచ్ఛగా ఉన్నట్లు ఆమె చెప్పారు. అయితే, ‘ నా చుట్టూ ఉన్నవాళ్లు ప్రస్తుతం నేను విజయం సాధించలేదనే అనుకుంటున్నారు.
‘గతంలో కంటే ఇప్పుడే నేను ఎక్కువ విజయవంతంగా ఉన్నాను’ అని సమంత అన్నారు. ప్రస్తుతం తాను చేస్తున్న పనులు ఎంతో ఉత్సాహాన్ని తనకు ఇస్తున్నాయని, వాటిని పూర్తి చేయడం కోసం ఆనందంగా నిద్ర లేస్తున్నట్లు ఆమె తెలిపారు.



