నవంబర్ 7న సాయిపల్లవి ‘ఏక్ దిన్’ మూవీ విడుదల

పల్లవి, వెబ్ డెస్క్ : వరుస సినిమాలతో మంచి కథలను ఎంచుకుని తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న నటి నేచూరల్ బ్యూటీ సాయిపల్లవి. చాలా మెచూర్యూడ్ గా కథలను ఎంచుకుని సెలెక్టివ్ పాత్రల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా దక్షిణాదిన తనకంటూ సుస్థిర స్థానాన్ని సొంతం చేసుకున్నారు సాయిప ల్లవి.
కొన్నాళ్లుగా ఆమె బాలీవుడ్ లో నూ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. సాయిపల్లవి కథానాయికగా నటించిన తొలి హిందీ చిత్రం ‘ఏక్ దిన్’ విడుదల తేదీ ఖరా రైంది. ఆమిరాఖాన్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రాన్ని నవంబర్ 7న విడుదల చేస్తు న్నట్లు యూనిట్ తెలిపింది.
ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో ఆమిరాఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా నటించారు. సునీల్ పాండే దర్శ కుడు. ఇక సాయిపల్లవి నటిస్తున్న మరో హిందీ చిత్రం ‘రామాయణ్’ వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి సంబంధించిన టీజర్ ఇటీవల విడులైన సంగతి తెల్సిందే.