బాలీవుడ్ లో సాయిపల్లవి పై ట్రోల్స్ .!

పల్లవి, వెబ్ డెస్క్ : నేచూరల్ బ్యూటీ సాయిపల్లవి సీతగా, బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ రాముడిగా, యశ్ రావణుడిగా నితేష్ తివారీ దర్శకత్వంలో ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో అత్యంత భారీ చిత్రం ‘ రామాయణ’ దాదాపు తొమ్మిది వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాను బాలీవుడ్ నిర్మాతలతో కల్సి తెలుగు సినిమా ఇండస్ట్రీ టాఫ్ ప్రోడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.
అయితే ఇంతవరకూ బాగానే ఉంది. ప్రస్తుతం హీరోయిన్ సాయిపల్లవి నటిస్తోన్న సీత పాత్రపై బాలీవుడ్ ఇండస్ట్రీలో ట్రోల్స్ నడుస్తున్నాయి. కొన్ని నార్త్ యూట్యూబ్ ఛానెళ్లు పని కట్టుకుని మరి బాలీవుడ్ ప్రముఖులతో కల్సి సాయి పల్లవి సీత పాత్రలో సరిపోదు. సీత చాలా అందంగా ఉంటుంది. అంత అందం సాయిపల్లవి కి లేదు. అందంగా లేని సాయిపల్లవి రాముడు రావణుడితో యుద్ధం చేయడం ఏంటని వెకిలి చేష్టలతో కామెంట్లు చేస్తున్నారు.
కాజల్ లాంటి అందాల బ్యూటీని ఎంపిక చేయకుండా సాయిపల్లవిని ఎందుకు ఎంపిక చేశారు. సాయిపల్లవి సీత పాత్రకు న్యాయం చేయదు. కాజల్ మాత్రమే ఆ పాత్రకు న్యాయం చేయగలదు. అసలు అందంగా లేని సాయిపల్లవి కోసం రావణసురుడు పరితపించడం ఏంటని పోస్టులు పెడుతున్నారు. అయితే సాయిపల్లవి ఫ్యాన్స్ మాత్రం తమ అభిమాన హీరోయిన్ మాత్రమే సీతపాత్రకు న్యాయం చేయగలదు. సీతమ్మ పాత్రలో ఉండాల్సింది అందం ముఖ్యం కాదు అభినయమే ముఖ్యం. అందరి హీరోయిన్ల మాదిరి సాయిపల్లవి ఎక్స్ పోజింగ్ చేయదు. బోల్డ్ పాత్రలు చేయదనే ఇలా వెకిలీ పోస్టులు, నెగిటీవ్ కామెంట్లు పెడుతున్నారని నార్త్ యూట్యూబ్ ఛానెళ్లను, నార్త్ వాళ్లను ఏకిపారేస్తున్నారు.