ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్
పల్లవి, వెబ్ డెస్క్ : ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్, పాన్ ఇండియా స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో తాజాగా ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెల్సిందే. అయితే, ఈ సినిమాలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ ఖరారైనట్లు తెలుస్తోంది.
తాజాగా ఆమె ఈ మూవీ చిత్రీకరణలో జాయిన్ అయినట్లు కూడా సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. టైగర్ బొమ్మలతో ప్రింట్ చేసిన షర్ట్ ధరించి తీసుకున్న ఫొటోలను రుక్మిణి తన ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ‘టైగర్ టైగర్ బర్నింగ్ బ్రైట్’ అని క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ ఫొటోలను తాజాగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.



