‘రాజ్ తరుణ్ లేకుండా బతకలేను’
పల్లవి, హైదరాబాద్: టాలీవుడ్ లో లావణ్య– రాజ్ తరుణ్ టాపిక్ సంచలనంగా మారింది. పరస్పర ఆరోపణలతో రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తాజాగా లావణ్య మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మాల్వీ మల్హోత్రా తనను చంపుతామనని బెదిరిందని అన్నది. మాల్వీ చంపుతానని బెదిరిస్తేనే తాను పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని చెప్పింది. మాల్వీ, రాజ్ తరుణ్ ఇద్దరు మైండ్ గేమ్ ఆడుతున్నారని, తరుణ్ లవర్ సినిమా చేసినప్పటి నుంచి గొడవలు ప్రారంభమయ్యాయని తెలిపింది. రాజ్ తరుణ్ లేకుండా తాను బతకలేనని చెప్పుకొచ్చింది. తన పేరెంట్స్ కి ఇష్టం లేకపోయిన ఆయనను పెళ్లి చేసుకున్నానని, గుడిలో పెళ్లి చేసుకున్నామన్నది. 11 ఏళ్లులుగా రాజ్ తరుణ్ తో కలిసి ఉన్నానన్న లావణ్య.. గత ఐదు నెలలుగా గొడవలు ప్రారంభమయ్యాయని పేర్కొంది. రాజ్ తరుణ్‌కు చాలామంది హీరోయిన్స్‌తో రిలేషన్స్ ఉన్నాయంటూ లావణ్య సంచలన కామెంట్స్ చేసింది. డ్రగ్స్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నది. ఒక పెళ్లికి గుంటూరు వెళ్లామని, తన దగ్గర రాజ్ తరుణ్ కాల్ రికార్డింగ్స్ కూడా ఉన్నాయన్నది. డబ్బుల కోసం నేను బెదిరించాల్సిన పనిలేదని, అతని కోసం చాలా భరించానని లావణ్య కీలక వ్యాఖ్యలు చేసింది.



