అల్లు అర్జున్‌కి రష్మిక స్పెషల్ గిఫ్ట్
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఒక స్పెషల్ గిఫ్ట్ పంపించారు. ఈ విషయాన్ని అల్లు అర్జున్ తన సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే..

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఒక స్పెషల్ గిఫ్ట్ పంపించారు. ఈ విషయాన్ని అల్లు అర్జున్ తన సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా ప్రస్తుతం పుష్ప 2 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ మూవీ విడుదల సందర్భంగా అల్లు అర్జున్‌కు, పుష్ప 2 సినిమా బ్లాక్ బస్టర్ సాధించాలని కొరుకుంటూ ఒక స్వీట్ గిఫ్ట్ పంపింది రష్మిక మందన్నా. దానితో పాటు ఒక నోట్ కూడా రాసుకొచ్చింది. “మనం ఎవరికైనా వెండిని బహుమతిగా ఇస్తే వాళ్లకు అదృష్టం కలిసొస్తుంది. నాచిన్న నాటి నుండి మా అమ్మ తరచుగా చెప్పిన విషయం ఇది. ఈ చిన్న వెండి వస్తువు, స్వీట్స్ మీకు మరింత అదృష్టం తీసుకురావాలని కోరుకుంటున్నాను. మీకు, మీ ఫ్యామిలీకి దీపావళి శుభాకాంక్షలు” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం రష్మిక చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.