ఇది నా చివరి రోజు.. రష్మిక ఎమోషనల్ పోస్ట్
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తన సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే "రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప 2.

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తన సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే “రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప 2. అల్లు అర్జున్ హీరోగా వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా చివరిరోజు షూటిగ్ జరిగింది. ఈ నేపధ్యంలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది రష్మిక.
“‘నవంబర్ 25న నా జీవితంలో ఎన్నో భావోద్వేగాలతో కూడుకున్న రోజు. ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. 24వ తేదీ సాయంత్రం పుష్ప2 షూటింగ్ పూర్తి అయ్యింది. ఈ సినిమాకు ఇదే నా చివరి రోజు షూట్. గత ఐదేళ్లుగా పుష్ప సెట్లోనే గడిపాను. కాబట్టి అది నాకొక ఇల్లులా మారిపోయింది. ఓవైపు బాధ, మరోవైపు ఆనందం. అన్ని రకాల భావోద్వేగాలతో నా మనసు నిండిపోయింది. ఈ సినిమా కోసం వర్క్ చేసిన ప్రతి ఒక్కరినీ ఇక నుంచి మిస్ అవుతాను” అని రాసుకొచ్చింది రష్మిక.